మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన జువ్వాడి కృష్ణారావు...
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్27:
మాజీ ప్రధానమంత్రి ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్ లో జరిగిన సంతాప సభలో మాట్లాడుతూ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా చేసిన సేవలు తీసుకొచ్చినఆర్థిక సంస్కరణలు ఆర్థిక పటిష్ట భారత్ గా రూపాంతరం చెందడానికి కారకులయ్యారని ఆ తర్వాత ప్రధానమంత్రిగా 10 ఏళ్లపాటు దేశానికి ఎనలేని సేవ చేశారని అన్నారు శ్రీ మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని జువ్వాడి కృష్ణారావు అన్నారు ఇంతటి మేధావి మృతి భారతదేశ నికి తీరని లోటని జువ్వాడి కృష్ణారావు అన్నారు ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ కొంతమ్ రాజాంనయీమ్ మ్యాకల నర్సయ్య అన్నం అనిల్ పుప్పాల ప్రభాకర్ ఎంబేరి నాగభూషణం వసీం వసీద్ జిందమ్ లక్ష్మీనారాయణ ఏ ఆర్ అక్బర్ మున్ను షేక్ మొహ్మద్ తెడ్డు విజయ్ ఎడ్ల రమేష్ బోయిని నాగరాజ్ సోగ్రాబి ఎలిశెట్టి భూమరెడ్డి బన్న రాజేష్ జాగిలం భాస్కర్ దండవేని వెంకటేష్ కోట గంగాధర్ ముజబిత్ అయూబ్ యూట్యూబ్ రాజు రియాజ్ నేము రి భూమయ్య చిట్యాల లక్ష్మీనారాయణ రిజ్వాన్ లింబాద్రితదితరులు ఉన్నారు