బ్యాటింగ్‌లో భారత్‌ తడబాటు.. 22 రన్స్‌కే 3 వికెట్లు

బ్యాటింగ్‌లో భారత్‌ తడబాటు.. 22 రన్స్‌కే 3 వికెట్లు

బ్రిస్బేన్‌: మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ (Ind vs Aus) పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆసీస్‌ బౌలర్లు పదునైన బంతులకు టీమ్‌ఇండియా టాప్‌ఆర్డర్‌ కుప్పకూలింది. హేజిల్‌వుడ్‌, స్టార్క్‌ పేస్‌ ధాటికి 22 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. 405 రన్స్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్‌ఇండియా ఫస్ట్‌ ఓవర్‌ రెండో బాల్‌కే వికెట్‌ కోల్పోయింది.

కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన యశస్వీ జైస్వాల్‌.. స్టార్క్‌ బౌలింగ్‌లో ఫస్ట్‌ బాల్‌కు ఫోర్‌ కొట్టాడు. అయితే రెండో బంతికి జైస్వాల్‌ను (4) స్టార్క్‌ బోల్తాకొట్టించడంతో మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. 3 బాల్స్‌ ఆడి 1 పరుగు చేసిన గిల్‌.. స్టార్క్‌ బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి మరోసారి నిరాశ పరిచాడు. ఇక సీనియర్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. 16 బాల్స్‌ ఆడిన కోహ్లీ 3 రన్స్‌ చేసి హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 7.2 ఓవర్లలో 22 రన్స్‌కే భారత్‌ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 13 రన్స్‌తో కేఎల్‌ రాహుల్‌ క్రీజ్‌లో ఉన్నాడు. అయితే భారత్‌ ఇన్నింగ్స్‌కు వర్షం అడ్డుపడింది. దీంతో ప్రస్తుతం మ్యాచ్‌ నిలిచిపోయింది.

 

 

Views: 9

About The Author

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక