రెండు పార్టులుగా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్.!

 రెండు పార్టులుగా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్.!

 టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విష‌యం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండ‌గా విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు నిర్మాత నాగ‌వంశీ. ఆయ‌న మాట్లాడుతూ.. వీడీ12 ప్రాజెక్ట్ రెండు పార్టులుగా రాబోతుంద‌ని ప్ర‌క‌టించాడు. ఈ ఆలోచ‌న సినిమా తీస్తున్న టైంలో రాలేద‌ని.. షూటింగ్ స్టార్ట్ అవ్వ‌క‌ముందే ఈ ఆలోచ‌న వ‌చ్చిన‌ట్లు తెలిపాడు. అయితే ఈ రెండు పార్టుల‌లో రెండు వేరు వేరు క‌థ‌లు ఉంటాయ‌ని నాగవంశీ చెప్పుకోచ్చాడు. మరోవైపు ఈ సినిమాను వ‌చ్చే ఏడాది మార్చిలో తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిపాడు. ఒక‌వేళ ఆ టైంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హరిహ‌ర వీర‌మ‌ల్లు ఉంటే త‌మ సినిమాను వాయిదా వేయ‌నున‌ట్లు చెప్పుకోచ్చాడు.

Views: 3

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి