10 గంటలకు సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ.. చిరంజీవి దూరం?

10 గంటలకు సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ.. చిరంజీవి దూరం?

 

హైదరాబాద్‌: సంధ్యా థియేటర్‌ ఘటన, అల్లు అర్జున్‌ అరెస్టుతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య దూరంపెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలు, అల్లు అర్జున్‌ అరెస్టు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఈ సమావేశం విషయంలో నిర్మాత, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌రాజు కీలకంగా వ్యవహిస్తున్నారు. అయితే సీఎంతో భేటీలో సినీ పెద్దలు ఎవరెవరు పాల్గొంటున్నారనే ఇంకా తెలియరాలేదు.

అయితే చిరంజీవి, వెంకటేశ్‌, అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌, హరీశ్‌ శంకర్‌, సురేశ్‌బాబు, నితిన్‌, వరుణ్‌తేజ్‌, శివ బాలాజీ, పుష్ప సినిమా నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తున్నది. ఇక ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ పాల్గొననున్నారు. కాగా, ఈ సమావేశానికి చిరంజీవి దూరం కానున్నట్లు తెలుస్తున్నది. పలు కారణాలతో ఆయన భేటీకి హాజరుకాకపోవచ్చని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. మెగా ఫ్యాన్స్‌కూడా తమ బాస్‌ దూరంగానే ఉండనున్నారని ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై మరికాసేపట్లో క్లారిటీ రానున్నది.

 

Views: 1

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి