ఎల్లమ్మలో నాయికగా?

ఎల్లమ్మలో నాయికగా?

సినిమాల ఎంపికలో సాయిపల్లవి చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. కథలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటేనే అంగీకరిస్తుంది. అందుకే ఆమె ఒప్పుకునే సినిమాల గురించి ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తారు. ఈ నేపథ్యంలో సాయిపల్లవి తెలుగులో మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..‘బలగం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు

దర్శకుడు వేణు యెల్దండి. ఆయన తన తదుపరి చిత్రంగా ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారు. నితిన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. తెలంగాణ నేపథ్య కథాంశమిది. ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిసింది.

ఈ కథ సాయిపల్లవికి బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించిందట. అయితే ఈ వార్తలో వాస్తవమేమిటో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ప్రస్తుతం సాయిపల్లవి ‘తండేల్‌’ చిత్రంలో నటిస్తున్నది. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలకానుంది. అనంతరం ‘ఎల్లమ్మ’ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం.

Views: 0

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి