ప్రైవేటు బడులకు రెండవ శనివారం సెలవు దినం ఉండదా..?
ప్రవేట్ బడుల్లో బానిసలుగా ప్రైవేటు ఉపాధ్యాయులు
ప్రభుత్వ సెలవుల కోసం పోరాడుతున్న ప్రవేట్ టీచర్స్ ఫోరం
అక్షరగెలుపు హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో రెండవ శనివారం సెలవు దినంగా ప్రవేట్ బడుల్లో అమలు చేసే బాధ్యత విద్యాశాఖ అధికారులు విస్మరించారు అని ప్రవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ విమర్శించారు. తెలంగాణలో ప్రవేటుబడులకు రెండో శనివారం వర్తించదా...? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రైవేటు బడుల యాజమాన్యాలు అంతా మా ఇష్టం అనే ధోరణిలో వ్యవహరిస్తూ ప్రభుత్వ సెలవు దినాలలో కూడా పాఠశాలలను నడిపిస్తూ విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను మానసికంగా ఒత్తిడి గురిచేస్తూ వారి జీవితాలతో చెలగాడమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మరియు మండల విద్యాశాఖ అధికారులు మేల్కొని ప్రైవేట్ బడుల్లో రెండవ శనివారం మరియు ప్రభుత్వ సెలవు రోజులు అమలు అయ్యేటట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నిరూపమ సంజయ్, భయ్యా శివరాజ్, నవీన్ కుమార్ గౌడ్ అలీ భాష తదితరులు పాల్గొన్నారు