యాదగిరిగుట్టలో 'గిరి ప్రదక్షిణ' 18న తెల్లవారు జామున 5.30 గంటలకు ప్రారంభం
అరుణాచలం, సింహాచలం తరహాలో అందరికీ చాన్స్
అక్షరగెలుపు యాదగిరిగుట్ట: మహిమాన్విత స్వయంభు యాద గిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి చెంత స్థానిక భక్తులు గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ ఈ సంప్రదాయం ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే 2016లో ఆలయాన్ని పునర్నిర్మించడంతో పాటు వర్యలు తీసుకుంది. దీంతో పరిసర ప్రాంతాల అభివృద్ధికి గత ప్రభుత్వం చర్యలు గిరిప్రదక్షిణ చేసేందుకు ఇబ్బందికరంగా మారింది, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే యాదగిరిగుట్టలో ఉన్న పాత ఆచారాలను పునరుద్ధ రించాలని నిర్ణయం తీసుకుంది. యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ స్వామి వారికి ఇప్పటివరకు స్థానిక భక్తులే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇక నుంచి అరుణాచలం, సింహాచలం తరహాలో భక్తులందరికీ గిరి ప్రదక్షిణ అవకా శాన్ని కల్పించాలని యాదగిరిగుట్ట అధికారులు సంకల్పించారు. స్వామి వారి ఆలయం చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18వ తేదీన స్వాతినక్షత్రం పుర స్కరించుకుని ఉదయం 5.30 గంటలకు స్వామివారి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు ఐదు వేల మందితో ప్రదక్షిణ కార్యక్ర మాన్ని ప్రారంభించనున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు ఉచి తంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు అధికారులు నిర్ణయించారు.