వరంగల్‌లో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
On
వరంగల్ : వరంగల్ – కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దర్గా రైల్వే గేటు వద్ద 40 ఏండ్ల వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైనట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. అయితే శుక్రవారం ఉదయం ఈ మార్గం గుండా వెళ్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి.. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడు బ్లూ కలర్ ప్యాంట్, తెలుపు రంగు షర్ట్ ధరించాడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Views: 6
About The Author


Tags:
Related Posts


Latest News
28 Feb 2025 19:23:26
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు
అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....