ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నిర్మాణ పనులు షురూ
By CHIFF EDITOR
On
అక్షరగెలుపు ఖైరతాబాద్ : వినాయక చవితి పండగ వచ్చిందంటే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహ రూపం, ఎత్తు, లాంటి అంశాలు భక్తుల్లో ఆసక్తిని నెలకొల్పుతాయి. వినాయక చవితికి రెండు నెలలు సమయం ఉండగానే ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.సోమవారం ఖైరతాబాద్ గణేశ్ మండలి వినాయక విగ్రహం ఏర్పాటుకు కర్రపూజ నిర్వహించింది. ఈ ఏడాది వినాయక చవితి పురస్కరించుకుని 70 అడుగుల మట్టి విగ్రహం తయారు చేయించాలని కమిటీ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ సందర్భంగా భారీ విగ్రహం తయారీకి పూజ చేశారు. ఈ కర్ర పూజ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
Views: 22
About The Author
Tags:
Latest News
గుంటూరు ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
21 Dec 2024 21:26:27
ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన