స్మార్ట్ ఫోన్ ను స్మార్ట్ గా వాడండి. సక్సెస్ కండి
స్మార్ట్ ఫోన్ తో సక్సెస్ అవ్వడం ఎలా??
By CHIFF EDITOR
On
ఫోన్స్ చేతికి వచ్చాక మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రతీ పనిని సేకండ్ల వ్యవధిలో వేళ్లపైనే పూర్తి చేసేస్తున్నాం. అమ్మడం,కొనడం,చూడడం,మాట్లాడడం ఇలా ఒకటేమిటి, సమస్తం స్మార్ట్ ఫోన్ ద్వారానే అయిపోతున్నాయి. మొదట్లో మాట్లాడడానికి మాత్రమే ఉపయోగపడిన ఫోన్, ఇప్పుడు చేతిలో పట్టే మినీ కంప్యూటర్‌లా మారిపోయింది. ఒకప్పుడు ఫోన్ ఇంట్లో ఉండేది కాబట్టి మనం బయటకు వస్తే ప్రశాంతంగా ఉండేవారం.కానీ ఇప్పుడు ఎవరు లేకున్నా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనే పరిస్థితికి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ తో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. కానీ ప్రస్తుతం విద్యార్థులు దీన్నికేవలం వీడియో గేమ్స్ అడుకునేందుకు, సినిమాలు చూసేందుకు, సోషల్ మీడియాలో చాట్ చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు.
మనం కొంచెం స్మార్ట్‌గా అలోచిస్తే స్మార్ట్ ఫోన్‌ను చదువులో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, సబ్జెక్ట్ పై పట్టు సాధించేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు.స్మార్ట్ ఫోన్‌ను వాడి విద్యార్థులు మరియు పెద్దలు ప్రయోజనం పొందవచ్చునో,అట్లే ఎలా వాడకూడదో అన్న విషయాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉంది.
స్మార్ట్ ఫోన్ లో చాలా అప్సన్ష్ ఉంటాయి.వీటిని సరిగా వినియోగించుకుంటే చాలా జ్ఞానాన్ని పొందవచ్చు.ముఖ్యమైన అంశాలను నోట్స్ గా రాసుకునేందుకు నోట్ పాడ్ ఉపయోగించవచ్చు. ముఖ్యమైన చిత్రాలను,డాక్యుమెంట్లను మొబైల్ లో దాచడం వల్ల అవసరమైనప్పుడు చదువు కోవచ్చు.వాయిస్ రికార్డుల ద్వారా కూడా మీరు చదివిన దానిని మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు.లేదా ముఖ్యఅంశాలను మరోమారు వినడానికి ఉపయోగించు కోవచ్చు.మాతృభాషతో పాటు,హిందీ మరియు ఇంగ్లీష్ భాషలు చాలామందికి వచ్చు.కానీ ఉత్సాహవంతులు మొబైల్ ద్వారా చైనీస్,ఫ్రెంచ్, జర్మన్ లాంటి ఎన్నో అంతర్జాతీయ భాషలను నేర్చుకోవచ్చు.దీని ద్వారా మీకు జ్ఞానంతో పాటు ఇతర భాషల పట్ల ఆశక్తి కలుగుతుంది. కొనకుండానే వందల సంఖ్యలో మీకు నచ్చిన పుస్తకాలను చదువవచ్చు. సాహిత్యం పట్ల అవగాహన పెంచుకుని ఉన్నతులుగా మారవచ్చు. మీరు పట్టుదలతో చదువుచున్న సందర్భంలో క్యాలెండర్ కూడా రూపొందించుకోవచ్చు. దాని ప్రకారం చదువుతూ ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు.మీరు కూర్చున్నచోటే అన్ని రకాల మరియు అన్ని భాషాల దిన,వార, పక్ష,మాస పత్రికలు ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు.ప్రస్తుతం జరుగుచున్న అంశాలను పరిశీలించి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం తెలుసు కోవచ్చు.అందమైన ఫోటో లు దిగడానికి కెమెరా గా ఉపయోగించు కోవచ్చు. కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అడ్రస్ తెలుసు కోవచ్చు. మనం ఎక్కడ ఉన్నామో లొకేషన్ ను తెలియచేసే దాని ఆధారంగా మనవారికి అడ్రస్ తెలియచేయవచ్చు.రాత్రివేళల్లో అత్యవసరానికి టార్చి లైట్ ను కూడా ఉపయోగించు కోవచ్చు.ఉదయం లెవడానికి అలారమ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేక సందర్భంలో ఫొటోలతో కూడిన వీడియో తయారు చేసుకోవచ్చు.ఎపుడైనా కాలక్షేపం కోసం పాటలు వినవచ్చు మరియు వీడియోలు చూడవచ్చు.
ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ ద్వారా నగదును మొబైల్ ఫోన్ నెంబర్ ద్వారా ఖాతాలోకి పంపే అవకాశం కూడా ఉంది.సృజనాత్మకత పెంచుకోవడానికి,మీకంటూ ఒక ప్రత్యేక హాబీ ఏర్పాటు చేసుకునుటకు మరియు దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీ స్మార్ట్ ఫోన్ నుండి సేకరించవచ్చు.మీరు సినిమాకు వెళ్లాలంటే అక్కడ క్యూలో ఉండి, టికెట్స్ తీసుకోవలసిన అవసరం లేకుండా ,మీ మొబైల్ ఫోన్ నుండి సినిమా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అదే విదంగా బస్ టికెట్స్, రైలు టికెట్స్,దేవాలయాల్లో దర్శనం టికెట్స్ కూడా ముందుగానే బుక్ చేసుకొనే అవకాశం మీ చేతిలోనే ఉంది.
మహిళలు అల్లికలు,కుట్లు, పోతలు మరియు రంగులద్దడం మొబైల్ లో చూస్తూ నేర్చుకొని ఆర్థికంగా కూడా సంపాదించుకొని అవకాశం ఉంది.ఒక ప్రాంత చరిత్ర లేదా ఒక వ్యక్తి చరిత్ర తెలుసుకోవాలంటే ఒక క్లిక్ తో మొబైల్ లో వచ్చేలా సాంకేతికత అభివృద్ధి చెందింది. ఇన్ స్టాగ్రామ్,ట్విట్టర్ అదే ఎక్స్ ద్వారా సెలబ్రిటీలు తమతమ స్పందనలు మరియు ప్రతి స్పందనలు తెలియ చేస్తున్నారు.
ఈ మధ్య వెండితెరకు మరియు బుల్లితెరకు పరిచయమైన వారు యూ ట్యూబ్ ఛానల్ ద్వారా పేరుగాంచిన వారే.వారు తమ స్వంత యూ ట్యూబ్ ద్వారా మొబైల్ లో అభిమానులను సంపాదించుకుని లక్షల్లో రూపాయలు సంపాదించారు.మహిళలు తమకు వచ్చిన వంటలు,ప్రత్యేక అంశాలను కూడా ప్రపంచానికి తెలియ చేస్తూ పేరు తో పాటు డబ్బు సంపాదించవచ్చు.మనకు ఏమి రాకున్నా మొబైల్ ద్వారా తెలుసుకొనే అవకాశం ఉంది.అలాగే మనకు తెలిసింది మొబైల్ లో అప్ లోడ్ చేయడం ద్వారా రూపాయలు సంపాదించవచ్చు.కానీ మీకంటే తెలివైన సైబర్ మోసగాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి.మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియ వన్ టైం పాస్ వర్డ్ లు మాత్రము ఎవరితో పంచుకోవద్దు.తెలియని వారితో ఆన్ లైన్ లో స్నేహం చేయవద్దు.మీ వ్యక్తిగత సమాచారం ఎవరికి ఇవ్వకండి. మీరెంత జ్ఞానాన్నైనా స్మార్ట్ ఫోన్ తో సంపాదించవచ్చు, అయితే మీ అజ్ఞానం వల్ల నష్టాలు మరియు కష్టాలు కూడా రావచ్చు.కాబట్టి జాగ్రత్త సుమా...
గడప రఘుపతి రావు
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
9963499282
Views: 31
About The Author
Tags:
Latest News
గుంటూరు ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
21 Dec 2024 21:26:27
ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన