మోకాలి గాయంపై ఆందోళన వద్దు: రోహిత్ శర్మ
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగే బాక్సింగ్ డే టెస్టు గురించి టీమిండియా జోరుగా ప్రిపరేవుతున్నది. అయితే ప్రాక్టీస్ సెషన్‌లో మోకాలికి గాయమైన అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే బ్యాటింగ్ పొజిషన్‌పై మాత్రం రోహిత్ సస్పెన్స్ పెట్టేశాడు. ఆదివారం ప్రాక్టీస్ టైంలో.. ఎంసీజీ మైదానంలో రోహిత్ గాయపడ్డాడు. బంతి అతని మోకాలికి బలంగా తగిలింది. అయితే ఆ గాయం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. మోకాలు బాగానే ఉన్నట్లు రోహిత్ చెప్పాడు.
ఇక కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ వల్ల రోహిత్ తన బ్యాటింగ్ ఆర్డర్‌పై తర్జనభర్జన పడుతున్నాడు. జైస్వాల్, రాహుల్ సెట్ కావడంతో.. చివరి రెండు టెస్టుల్లో రోహిత్ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. చివరి మూడ ఇన్నింగ్స్‌లో అతను కేవలం 10, 3, 6 రన్స్ మాత్రమే చేశాడు. జట్టు ఏది ఉత్తమమో అదే చేయనున్నట్లు రోహిత్ తెలిపాడు. తన బ్యాటింగ్ పొజిషన్‌ను త్యాగం చేస్తున్నట్లు రెండో టెస్టు సమయంలో రోహిత్ చెప్పిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ పొజిషన్ గురించి ఆందోళన వద్దన్నాడు.
విరాట్ కోహ్లీ ఫామ్ గురించి కూడా రోహిత్ రియాక్ట్ అయ్యాడు. పెద్ద స్కోర్లు చేయలేకపోతున్న కోహ్లీ గురించి మాట్లాడుతూ.. అతను తప్పకుండా తన ఫామ్ సాధిస్తాడన్నాడు. ఆధునిక క్రికెట్‌లో కోహ్లీ ఓ మేటి బ్యాటర్ అని, మ్రాడన్-డే క్రికెటర్లు తమ మార్గాన్ని తామే ఎంచుకుంటారని రోహిత్ బదులిచ్చాడు. పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ సెంచరీ చేసినా.. ఆ తర్వాత రెండో టెస్టులో 7, 11 రన్స్ చేశాడు. బ్రిస్బేన్‌లో కేవలం 3 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. జైస్వాల్ స్వేచ్ఛ ఆడే రీతిలో అతన్ని ఎంకరేజ్ చేస్తున్నట్లు చెప్పాడు.
ఇక ఆస్ట్రేలియా యువ బ్యాటర్ సామ్ కొంటాస్ .. బాక్సింగ్ డే టెస్టులో అరంగేట్రం చేయనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇండియన్ పేసర్ మహమ్మద్ షమీని ఆసీస్‌తో జరిగే మిగితా రెండు టెస్టులకు ఎంపిక చేయలేదు.