లగచర్లకు రైతులకు సంఘీభావంగా.. నల్ల అంగీలు, చేతులకు బేడీలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన

లగచర్లకు రైతులకు సంఘీభావంగా.. నల్ల అంగీలు, చేతులకు బేడీలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన

హైదరాబాద్‌: లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడి రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా శాసనమండలి సభ్యులు కూడా మండలిలో నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు.

అంతకుముందు పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణ, రైతుల అరెస్టుపై బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ అంశాలపై సభలో చర్చించడానికి అనుమతించాలంటూ స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ వాయిదా తీర్మానం అందజేశారు.BRS-2-1_V_jpg--816x480-4g

Views: 16

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి