భూమి హక్కు చట్టాల పై రౌండ్ టేబుల్ సమావేశం

భూమి హక్కు చట్టాల పై రౌండ్ టేబుల్ సమావేశం

 

హుస్నాబాద్ ఆర్సి ఇంచార్జ్ (అక్షర గెలుపు)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాసనాలను ఏకీకృతం చేయుటకు సవరించుటకు బిల్లును నిర్వీగ్నంగా అమలు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని కొత్తపెళ్లి లో జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కొంగల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతానని చెప్పినా రేవంత్ రెడ్డి దీనిని చట్టం చేసే ప్రయత్నం కొనసాగుతుందని ఆరోపించారు. ప్రతి గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని గ్రామస్థాయి నుండి రెవెన్యూ అధికారులను నియమించాలన్నారు. ఒక యూనిట్ నెలకొల్పి శిస్తు వసూలు చేస్తూ దానిని ప్రభుత్వమే చెల్లించాలన్నారు. గతంలో లాగానే రెవెన్యూ రికార్డులను నమోదు చేసి రికార్డులను మైంటైన్ చేస్తూ పబ్లిక్ గెజిట్లో పెట్టాలన్నారు. ప్రతి రికార్డులో కౌలుదారు పట్టదారు రికార్డు చేసి కౌలుదారు చట్టాన్ని పూర్తిస్థాయిలో సవరణ చేసి వారికి ప్రభుత్వ పరంగా సాగుకే సహాయం చేయాలని రైతు బీమా పంట నష్టం హక్కులను కల్పించాలని వారు పేర్కొన్నారు. రైతులు తీసుకున్న అప్పు నో కలెక్టర్ వసూలు చేసే ప్రతిపాదనను ఉపసంహరిం చుకోవాలని భవిష్యత్తులో గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 58 59 మాదిరిగా భూములు స్వాధీనం చేసే జీఓ లు తీసుకొచ్చి రైతుల నుండి భూములను లాక్కునే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో సూచించిన విషయాలను రాష్ట్ర, కేంద్రానికి పంపించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌలు రైతు సంఘం అధ్యక్షుడు నెట్టెం నారాయణ మర్రి శ్రీనివాస్ జిల్లా సమితి నాయకులు మడ్డి రాజారాం మనోహర్ మోహన్ కొమురవెల్లి రైతు నాయకులు పాల్గొన్నారు.

Views: 17

About The Author

CHIFF EDITOR  Picture

D.VENKATESH  PHONE NUMBER : 9490817191

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి