పెళ్లి చేసుకో.. పెళ్లి కొడుకును దోచుకో.. ఒంటరి పురుషులే ఈ కిలాడీ టార్గెట్స్..!

పెళ్లి చేసుకో.. పెళ్లి కొడుకును దోచుకో.. ఒంటరి పురుషులే ఈ కిలాడీ టార్గెట్స్..!

 ఆమె నిత్య పెళ్లి కూతురు..! ఒంటరి పురుషులే లక్ష్యంగా తన బృందంతో కలిసి గాలం వేస్తుంది..! బుట్టలో పడిన వారిని పెళ్లి చేసుకుంటుంది..! వారి ఇంట్లో ఇల్లాలుగా అడుగుపెడుతుంది..! కలిసి కాపురం చేస్తుంది..! అవకాశం చిక్కగానే ఇంట్లోని నగదు, నగలు తీసుకుని ఉడాయిస్తుంది..! ఇలా ఒకరి తర్వాత ఒకరిని ఏకంగా ఆరుగురిని మోసం చేసింది..! తాజాగా ఏడో వ్యక్తిని మోసం చేసే ప్రయత్నంలో తన టీమ్‌తో సహా పోలీసులకు చిక్కింది..!

వివరాల్లోకి వెళ్తే.. పూనమ్‌, సంజనా గుప్తా, విమలేశ్‌ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతి నలుగురూ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో పూనమ్‌ పెళ్లి కూతరులా, సంజనా ఆమెకు తల్లిలా వ్యవహరిస్తుంది. విమలేశ్‌, ధర్మేంద్ర ఒంటరి పురుషులు ఎక్కడ ఉన్నారా.. అని టార్గెట్స్‌ కోసం వెతుకుతారు. టార్గెట్‌ దొరకగానే అమ్మాయిని చూపిస్తామని, అందుకు రూ.1.5 లక్షలు ఫీజుగా చెల్లించాలని అంటారు.

అవతలి పార్టీ అందుకు ఒప్పుకోగానే పూనమ్‌, సంజనాల దగ్గరికి తీసుకెళ్తారు. వారు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరికి పెళ్లి జరిపిస్తారు. అనంతరం పూనమ్‌ పెళ్లి కొడుకుతో అతని ఇంటికి వెళ్తుంది. అక్కడ అవకాశం చిక్కేదాక అతనితో కాపురం చేస్తుంది. అవకాశం చిక్కగానే ఆ ఇంట్లోని నగదు, నగలు తీసుకుని పరారవుతుంది. ఇదే క్రమంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన శంకర్‌ ఉపధ్యాయ్‌ అనే వ్యక్తిని ఈ ముఠా టార్గెట్‌ చేసింది.

విమలేష్‌, ధర్మేంద్ర అతనితో మాట్లాడి పూనమ్‌, సంజనాలతో మాట్లాడించారు. అయితే శంకర్‌ ఉపాధ్యాయ్‌కి వారు తీరుపై అనుమానం కలిగింది. దాంతో రూ.1.5 లక్షలకు ముట్టజెప్పేందుకు నిరాకరించాడు. దాంతో పూనమ్‌ ముఠా అతడిని బెదిరించింది. తప్పుడు కేసు పెట్టి జైల్లో వేయిస్తామని హెచ్చరించింది. దాంతో తనకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని చెప్పి అతడు అక్కడి నుంచి బయటపడ్డాడు. తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. బాందా పోలీసులు ఆ ముఠాను అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని