కొన్ని నెలలుగా అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక.. తాత, తండ్రి, మరో వ్యక్తి అరెస్ట్‌

 కొన్ని నెలలుగా అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక.. తాత, తండ్రి, మరో వ్యక్తి అరెస్ట్‌

లక్నో: ఇంట్లోని కుటుంబ సభ్యులు బాలికపై పలు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బాలిక తాత, తండ్రి, బంధువైన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయ్యా జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. డిసెంబర్‌ 27న బిదునా పోలీస్ స్టేషన్‌ ప్రాంతానికి చెందిన మైనర్‌ బాలిక తన బంధువైన మహిళతో కలిసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నది. గత కొన్ని నెలలుగా తాత, తండ్రి, బంధువు పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఆ బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె రెండు నెలల గర్భవతిగా నిర్ధారణ అయ్యింది.

కాగా, బాధిత బాలిక ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత కొన్ని నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడిన తాత, తండ్రి, బంధువైన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

 

Views: 2

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి