రామేశ్వరం తీరంలో కలకలం.. దుస్తులు మార్చుకునే గదిలో రహస్య కెమెరా గుర్తించిన మహిళ..!

రామేశ్వరం తీరంలో కలకలం.. దుస్తులు మార్చుకునే గదిలో రహస్య కెమెరా గుర్తించిన మహిళ..!

 తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామేశ్వరం ఆలయం వద్ద షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఆలయ సందర్శనకు వెళ్లిన ఓ భక్తురాలికి చేదు అనుభవం ఎదురైంది. సముద్రతీరంలో దుస్తులు మార్చుకునే గదిలో రహస్య కెమెరా  లభ్యమైంది. ఇది చూసిన సదరు భక్తురాలు ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

పుదుకోట్టైకి చెందిన మహిళ కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వరం ఆలయ సందర్శనకు వెళ్లింది. ఆలయ ఆచారాల్లో భాగంగా అగ్నితీర్థం వద్ద సముద్రస్నానం ఆచరించింది. అనంతరం దుస్తులు మార్చుకునేందుకు తీరం వద్ద ఓ ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్లింది. అక్కడ రహస్యంగా ఉంచిన కెమెరాలను గుర్తించింది. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు, ఆలయ అధికారుల దృష్టికిక తీసుకెళ్లింది.

మహిళ ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఆలయ అధికారులు గదిలో రహస్యంగా అమర్చిన కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. బూత్‌ నిర్వాహకులు రాజేష్‌ను అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ తర్వాత సమీపంలో టీస్టాల్‌ నడుపుతున్న మీరా మొయిదీన్‌ అనే వ్యక్తిని కూడా అరెస్ట్‌ చేశారు. అతడు రాజేష్‌కు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని