నడిరోడ్డుపై మంటల్లో చిక్కుకున్న రూ.కోట్లు ఖరీదైన లాంబోర్గినీ కారు.. వీడియో

నడిరోడ్డుపై మంటల్లో చిక్కుకున్న రూ.కోట్లు ఖరీదైన లాంబోర్గినీ కారు.. వీడియో

మహారాష్ట్ర ముంబై లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. కోస్టల్‌ రోడ్‌ లో కోట్ల ఖరీదైన లగ్జరీ లాంబోర్గినీ కారు మంటల్లో చిక్కుకుంది. బుధవారం రాత్రి 10:20 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని దాదాపు 45 నిమిషాలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. గుజరాత్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆరెంజ్‌ కలర్‌ కారు క్యాబిన్‌లో మంటలు వస్తున్న వీడియోను వ్యాపార దిగ్గజం గౌతమ్‌ సింఘానియా ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ కారు ఖరీదు రూ.9 కోట్లు అని సమాచారం.

 

Views: 4

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి