పేలిన స్కూల్‌ బస్సు టైరు.. గాలిలోకి ఎగిరిపడిన మెకానిక్‌

పేలిన స్కూల్‌ బస్సు టైరు.. గాలిలోకి ఎగిరిపడిన మెకానిక్‌

బెంగళూరు: రిపేర్‌ చేసిన స్కూల్‌ బస్సు టైరులోకి గాలి నింపుతుండగా అది పేలింది. దీంతో అక్కడున్న మెకానిక్‌ గాలిలోకి ఎగిరిపడ్డాడు. తలకు గాయమైన అతడ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాతీయ రహదారి 66లోని కోటేశ్వర్ సమీపంలో టైరు పంక్చర్ షాపు వద్ద 19 ఏళ్ల అబ్దుల్ రజీద్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం ఒక స్కూల్‌ బస్సు టైర్‌కు పంక్చర్‌ అయ్యింది.

కాగా, మెకానిక్‌ అబ్దుల్‌ ఆ స్కూల్‌ బస్సు టైర్‌కు రిపేర్‌ చేశాడు. అనంతరం టైర్‌లోకి గాలి నింపసాగాడు. అయితే ఉన్నట్టుండి ఆ టైరు పేలింది. ఆ సమయంలో అక్కడ నుంచి కదలబోతున్న అబ్దుల్‌ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపడ్డాడు. తలకు గాయమైన ఆ యువకుడ్ని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని