లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని కచ్చితంగా తీసుకోవాల్సిందే..!
మన శరీరం లోపలి అతి పెద్ద అవయవాల్లో లివర్ మొదటి స్థానంలో ఉంటుంది. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటేనే లివర్ పనితీరు సరిగ్గా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం లివర్ విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం తినే ఆహారం ప్రభావం లివర్‌పై పడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లివర్‌కు మేలు చేస్తాయి. కానీ అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే లివర్ పాడవుతుంది. లివర్‌కు అవసరమైన పోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తుండాలి. అలాగే తగినన్ని నీళ్లను కూడా తాగాల్సి ఉంటుంది. దీంతో లివర్‌లో ఉన్న వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు గాను పలు ఆరోగ్య సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నీళ్లు..
కొందరు పని ఒత్తిడిలో పడి లేదా ఇతర కారణాల వల్ల రోజుకు తగినన్ని నీళ్లను తాగలేకపోతుంటారు. అయితే ఇలా జరిగితే లివర్‌లో వ్యర్థాలు పేరుకుపోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రోజుకు తగినన్ని నీళ్లను తాగితేనే లివర్ పనితీరు సరిగ్గా ఉంటుంది. లివర్‌లో ఉన్న టాక్సిన్లు సులభంగా బయటకు పోయి లివర్ క్లీన్ అవుతుంది. లివర్ పనితీరు సరిగ్గా ఉంటే శరీరంలోని ఇతర అవయవాలు కూడా సరిగ్గా పనిచేస్తాయి. దీంతో మనం రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. కొందరు జంక్ ఫుడ్‌ను అధికంగా తింటుంటారు. ముఖ్యంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, చక్కెర పదార్థాలు, రీఫైన్డ్ పిండి పదార్థాలను అధికంగా తింటారు. దీని వల్ల లివర్‌పై అధికంగా భారం పడుతుంది. కనుక ఇలాంటి ఆహారాలను తినడం పూర్తిగా తగ్గించాలి. లేదా మానేయాలి. దీంతో పనితీరు సరిగ్గా ఉంటుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు..
అవకాడోలు, ఆలివ్ ఆయిల్, నట్స్ వంటి ఆహారాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో లివర్‌లో ఉన్న వ్యర్థాలు బయటకు పోయి లివర్ క్లీన్ అవుతుంది. కనుక ఈ ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. నిమ్మ, నారింజ వంటి పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌లోని వ్యర్థాలను బయటకు పంపడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. కనుక వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. గ్రీన్ టీలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగానే ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో లివర్ డ్యామేజ్ అవకుండా ఉంటుంది. అలాగే లివర్ పనితీరు మెరుగు పడుతుంది. కనుక రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీని సేవిస్తుంటే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
పసుపు..
మనం నిత్యం వంటల్లో పసుపును వాడుతుంటాం. అయితే దీన్ని నేరుగా తీసుకునే ప్రయత్నం చేయాలి. పసుపులో కర్‌క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. దీంతో పైత్య రసం ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా లివర్ క్లీన్ అవుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి పూట పాలలో పసుపు కలిపి తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. అలాగే క్యాలిఫ్లవర్, క్యాబేజీ వంటి ఆహారాలను తరచూ తింటుండాలి. ఇవి కూడా లివర్‌ను క్లీన్ చేయడంలో ఎంతగానో సహాయ పడతాయి. లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. వెల్లుల్లిల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి లివర్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. దీంతో శరీరంలో ఉన్న వ్యర్థాలను లివర్ సులభంగా బయటకు పంపిస్తుంది. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకుంటూ జాగ్రత్తలను పాటించడం వల్ల లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
About The Author


Related Posts

