కారు కింద చిక్కుకున్న దూడ.. చుట్టుముట్టిన ఆవులు, తర్వాత ఏం జరిగిందంటే?
రాయ్‌గఢ్: కొన్ని ఆవులు రోడ్డుపై ఉన్నాయి. దూడ మీదుగా ఒక కారు దూసుకెళ్లింది. కొంత దూరం దానిని ఈడ్చుకెళ్లింది. దీంతో దూడ ఆ కారు కింద చిక్కుకున్నది. ఈ నేపథ్యంలో ఆవులు ఆ కారును చుట్టుముట్టాయి. స్పందించిన స్థానికులు కారు కింద చిక్కుకున్న దూడను రక్షించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. రద్దీ రహదారిలో ఆవుల మంద ఉన్నది. వేగంగా వెళ్తున్న కారు ఒక దూడను ఢీకొట్టింది. సుమారు 200 మీటర్ల వరకు దానిని ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ చిన్న లేగ దూడ ఆ కారు కింద చిక్కుకున్నది.
కాగా, ఇది గమనించిన ఆవులు ఆ కారును అడ్డుకుని చుట్టుముట్టాయి. దూడ కోసం ఆ కారు చుట్టూ తిరిగాయి. ఇది చూసి స్థానికులు స్పందించారు. కొందరు వ్యక్తులు కలిసి ఆ కారును ఒక వైపునకు ఎత్తారు. కారు కింద చిక్కుకున్న దూడను సురక్షితంగా బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన దానికి చికిత్స అందించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
About The Author


Related Posts

