మూడు పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు.. ‘లూటీ వధువు’ అరెస్ట్‌

మూడు పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు.. ‘లూటీ వధువు’ అరెస్ట్‌

 

జైపూర్‌: ఒక మహిళ పలువురిని పెళ్లాడింది. ఆ తర్వాత వారి నుంచి విడిపోయి డబ్బులు డిమాండ్‌ చేసింది. ఇలా ఇప్పటి వరకు ముగ్గురిని వివాహం చేసుకున్నది. వారి నుంచి రూ.1.25 కోట్ల మేర లూటీ చేసింది. (Looting Bride) మూడో భర్త ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. ‘లూటీ వధువు’గా పేర్కొన్న ఆ మహిళను అరెస్ట్‌ చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన నిక్కి అలియాస్ సీమ 2013లో ఆగ్రాకు చెందిన వ్యాపారవేత్తను తొలిసారి పెళ్లాడింది. కొంత కాలం తర్వాత ఆ వ్యక్తి కుటుంబంపై కేసు పెట్టింది. కేసు రాజీలో భాగంగా రూ.75 లక్షలు అందుకున్నది.

కాగా, 2017లో గురుగ్రామ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను సీమా వివాహం చేసుకున్నది. అతడి నుంచి విడిపోయిన ఆమె సెటిల్‌మెంట్‌గా రూ.10 లక్షలు తీసుకున్నది. ఆ తర్వాత 2023లో జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్తతో సీమా పెళ్లి జరిగింది. అయితే ఆ వెంటనే రూ.36 లక్షల విలువైన బంగారు నగలు, నగదుతో అతడి ఇంటి నుంచి పారిపోయింది. వరుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీమాను అరెస్ట్‌ చేశారు.

మరోవైపు నిందితురాలు సీమాను ‘లూటేరి దుల్హన్’ (దోపిడీలకు పాల్పడుతున్న వధువు)గా జైపూర్ పోలీసులు అభివర్ణించారు. విడాకులు తీసుకున్న లేదా భార్యలను కోల్పోయిన ధనవంతులైన మగవారిని మ్యాట్రిమోనియల్ సైట్‌లలో వెతికి వారిని ఆమె టార్గెట్‌ చేస్తుందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ముగ్గురిని పెళ్లాడిన సీమా వారి నుంచి రూ.1.25 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు.

 

Views: 0

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి