ఏడాదిన్నరలో 10 లక్షల పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: గత ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో తమ ప్రభుత్వం యువతకు సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రోజ్‌గార్ మేలా వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. 71 వేల మంది అపాయింట్‌మెంట్ లేఖలు అందజేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ పథకాల్లో, ప్రోగ్రామ్‌ల్లో తమ ప్రభుత్వం ప్రత్యేక స్థానం కల్పించిందన్నారు. పారదర్శకత వల్లే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేగంగా జరిగినట్లు చెప్పారు. రిక్రూట్ అయినవారిలో ఎక్కువ శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు.
26 వారాల మెటర్నిటీ లీవ్‌ను ఇవ్వడం వల్ల మహిళలకు తమ కెరీర్‌లో ఎక్కువ లాభం జరిగినట్లు ప్రధాని మోదీ చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద ఎక్కువ మంది లబ్ధిదారులు మహిళలే అన్నారు. దేశంలో మహిళా కేంద్రీకృత అభివృద్ధి జరుగుతున్నట్లు తెలిపారు. వీలైనంతగా యువత సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని తమ ప్రభుత్వం వాడుకుంటోందన్నారు. అనేక స్కీమ్‌లు ప్రారంభానికి వాళ్లు కేంద్రంగా మారినట్లు తెలిపారు.
About The Author


Related Posts

