మక్కాలో మహా విషాదం...645 మంది భక్తులు మృతి…
: ముస్లింల పవిత్ర భూమి మక్కాలో (Mecca) ఘోర విషాదం చోటుచేసుకుంది. హజ్ తీర్థయాత్ర (Hajj pilgrimage)కు వచ్చిన లక్షలాది మంది యాత్రికుల్లో అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ దుర్ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించడంతో యావత్ ముస్లింలు భయాందోళనకు గురవుతున్నారు.
మక్కాలో అధిక ఉష్ణోగ్రత వల్ల మొత్తం 645 హజ్ యాత్రికులు (Hajj pilgrims) మరణించినట్లుగా సౌదీ అరేబియా(Saudi Arabia) మీడియా తెలిపింది. వీరిలో భారతదేశానికి (India) చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.హజ్ యాత్రకు వెళ్లిన వారిలో 68మంది భారతీయులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతులతో పాటు మరో 2వేల మందికిపైగా అస్వస్థతకు గురై స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంవత్సరం దాదాపు 16 లక్ష మంది యాత్రికులు హజ్ యాత్రలో పాల్గొన్నారు. వీరంతా వివిధ దేశాల నుంచి వచ్చినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులు తెలిపారు.
వేడి గాలులు తట్టుకోలేక..
మక్కాలో విపరీతమైన వేడి కారణంగా 645 మంది హజ్ యాత్రికులు మరణించారు. బక్రీద్ నేపథ్యంలో హజ్ యాత్రకు పెద్ద సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. అక్కడ 50 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని స్తానిక వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.దీంతో ఎండ వేడిమికి తట్టుకోలేక వడదెబ్బకు గురై 645 మంది చనిపోయారు.
645 మంది మృతుల్లో 68 మంది ఇండియన్స్..
చనిపోయిన హజ్ యాత్రికులలో కనీసం 323 మంది ఈజిప్షియన్లు, కనీసం 60 మంది జోర్డానియన్లు ఉన్నారు. వీరితో పాటు అనేక దేశాల నుండి 150 మందికి పైగా మరణించారు. భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లిన 68 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
అనారోగ్యంతో 2వేల మంది ఆసుపత్రిలో చేరిక..
ముస్లింలు పవిత్ర ప్రదేశంగా భావించే మక్కాలో విపరీతంగా వీస్తున్న వేడిగాలుల కారణంగా 645 మంది మరణించారు. 2 వేల మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వీరంతో ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. వీళ్లే కాకుండా మరికొంత మంది గల్లంతైనట్లుగా కూడా తెలుస్తోంది.ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా, ఇరాక్ తో పాటు స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిస్తాన్ ప్రాంతానికి చెందిన వాళ్లు కూడా మృతుల్లో ఉన్నట్లుగా ధృవీకరించారు.
బక్రీద్ కారణంగా భక్తుల రద్దీ..
బక్రీద్ ముస్లింలకు పవిత్ర పండుగ అని దాని కారణంగానే మక్కాలో హజ్ యాత్రికుల సంఖ్య పెరిగిందని స్థానిక అదికారులు చెప్పారు. వివిధ దేశాల నుంచి 16 లక్షల మంది యాత్రికులు వచ్చినట్లు సమాచారం.
హజ్ ముస్లింల పవిత్ర యాత్ర
హజ్ ముస్లింలకు పవిత్ర యాత్ర. జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ చేయాలని ఇస్లాం చెబుతోంది. ఈ పండుగతో హజ్ ఆచారాలు ముగుస్తాయి. బక్రీద్ సందర్భంగా లేదా దుల్ హజ్ నెల తొమ్మిదవ రోజున, హజ్ యాత్రికులు మక్కాలోని అరాఫత్ పర్వతం దగ్గర గుమిగూడారు. ఈ యాత్రికులకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ రోజున ఉపవాసం ఉంటారు.
About The Author
![CHIFF EDITOR Picture](https://www.aksharagelupu.com/media/c400x400/2024-07/20240719_115942.jpg)
![](https://www.aksharagelupu.com/media/2024-06/wanted-akshara-gelupu.jpg)
![](https://www.aksharagelupu.com/media/2024-06/wanted-akshara-gelupu.jpg)
![](https://www.aksharagelupu.com/media/350/2024-07/ad.jpeg)