ఐ డి ఓ సి కార్యాలయంలో జాతీయ పతాకం ఆవనతం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 27.
ప్రఖ్యాత ఆర్థికవేత్త మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. దీనిలో భాగంగా సి ఎస్ శాంతి కుమారి ఆదేశానుసారం, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచన మేరకు ఐ డి ఓ సి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని అవనతం చేయడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభ సమయంలో దేశాన్ని ఒంటిచేత్తో ఒడ్డెక్కించారు అని అన్నారు. ప్రపంచాన్ని కుదిపేసిన తీవ్ర మాంద్యం పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరలేదంటే దాని ప్రధాన కారణం మన్మోహన్ సింగ్ అనుసరించిన విధానాలే ప్రధాన కారణం అని తెలియజేశారు .