ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురు మృతి
On
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భావ్‌నగర్ జిల్లాలోని జాతీయ రహదారిపై డంపర్ ట్రక్కును ఓ ప్రైవేట్ బస్సు బలంగా ఢీ కొట్టింది ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ట్రాపాజ్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భావ్‌నగర్ నుంచి మహువ వైపు వెళ్తున్న బస్సు.. డంపర్ ట్రక్కును వెనుకనుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 10 మంది గాయపడినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షద్ పటేల్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Views: 22
About The Author
Tags:
Latest News
గుంటూరు ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
21 Dec 2024 21:26:27
ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన