బిజినెస్ ప్రమోషన్ కాల్స్‌కు ఇక చెక్
స్పామ్ కాల్స్ కంట్రోల్ చేసేందుకు కేంద్రం చర్యలు
అక్షరగెలుపు న్యూఢల్లీ జూన్20:బిజినెస్ ప్రమోషన్స్‌లో భాగంగా వినియోగదారులను వేధించే కాల్స్‌కు ఇక చెక్ పడనుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ఇక కాల్స్ చేయకుండా కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. బిజినెస్ ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పొద్దున్నే నిద్రలేచిన దగ్గరి నుంచి పదుల సంఖ్యలో క్రెడిడ్ కార్డ్ కావాలా, లోన్ కావాలా? మా యాప్ వాడండి, మా కంపెనీ హెయిర్ ఆయిల్ వాడండి, ప్లాట్ కొనండి అంటూ బిజినెస్ కాల్స్ వస్తాయి. అస్తమానం విసిగించే అనవసరపు బిజినెస్ ప్రమోషనల్ కాల్స్ వల్ల ప్రజలు ఇబ్బందుల పడుగుతన్నారని ప్రభుత్వం గమనించింది. వాటికి చెక్ పెట్టేందుకు ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించడానికి ప్రజల అభిప్రాయాలను సేకరించాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. జులై 21లోపు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలను విజ్ఞప్తి చేసింది. ప్రజాభిప్రాయం తర్వాత ముసాయిదా మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయనుంది. టెలికాం సంస్థలు, రెగ్యుటరేటర్లతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు రూపొందించనుంది. యూజర్ పర్మిషన్ లేకుండా వచ్చే కాల్స్, అన్ వాంటెడ్ వ్యాపార ప్రమోషన్స్ కిందకు వస్తాయి. రిజిస్టర్ చేయని నంబర్, ఎస్‌ఎంఎస్ హెడర్‌లను ఉపయోగించడం, యూజర్ కాల్ కట్ చేసిన మళ్లీ కాల్ చేయడం వంటి వాటిని బ్యాన్ చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్పామ్ కాల్స్, ప్రమోషనల్ కాల్స్‌తో విసిగిపోయిన వారికి గుడ్‌న్యూస్ కానుంది.