ఇన్వెస్టర్లకు లాభాల పంట.. బంగారం.. గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్‌పై రిటర్న్స్ ఎంతో తెలుసా.. ?!

ఇన్వెస్టర్లకు లాభాల పంట.. బంగారం.. గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్‌పై రిటర్న్స్ ఎంతో తెలుసా.. ?!

బంగారం అన్నా, బంగారం ఆభరణాలు అన్నా, వెండి అన్నా భారతీయులకు ఎంతో ఇష్టం. పండుగలు, కుటుంబ వేడుకలు, ఇతర పర్వదినాల సందర్భంగా భారతీయ మహిళలు బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతుంటారు. వీలు కాకుంటే ఉన్న బంగారం ఆభరణాలే ధరించడానికి ఉత్సుకత ప్రదర్శిస్తుంటారు. రోజురోజుకు ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో పెట్టుబడులకు ప్రత్యామ్నాయ మార్గంగా కూడా బంగారం నిలుస్తోంది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.63,870 పలికింది. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లలో తులం బంగారం ధర రూ.79,200లకు చేరుకుంది. అంటే దాదాపు 24 శాతం బంగారం ధర పెరిగింది. ఇక కిలో వెండి ధర జనవరి ఒకటో తేదీన రూ.80 వేల వద్ద తచ్చాడితే శుక్రవారం రూ. 91,700 పలుకుతోంది. అంటే వెండి కొనుగోళ్లపై 16 శాతం రిటర్న్స్ లభిస్తున్నాయన్న మాట.

గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్‌పై 20 శాతం రిటర్న్స్

బంగారం దిగుమతులను నిరుత్సాహ పర్చడానికి కేంద్రం ఈటీఎఫ్ లు తీసుకొచ్చింది. ఫిజికల్ బంగారంతోపాటు డిజిటల్ బంగారంగా భావించే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు ఈ ఏడాది దాదాపు 20 శాతం రిటర్న్స్ అందించాయి. ఇక వెండి ఈటీఎఫ్స్ మీద 19.66 శాతం రిటర్న్స్ లభించాయి. వివిధ బ్యాంకులు, సంస్థలు నిర్వహించిన ఈ ఈటీఎఫ్ ఫండ్స్ 31 వరకూ ఉన్నాయి. గోల్డ్ ఈటీఎఫ్స్‌ల్లో అత్యధికంగా హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్ నుంచి 20.30 శాతం రిటర్న్స్ వస్తే, ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ 20.29 శాతం లాభాలు గడించి పెట్టింది. ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ 19.94 శాతం, యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్ కనిష్టంగా 19.66 శాతం రిటర్న్స్ మాత్రమే ఇన్వెస్టర్లకు అందించింది.

ఇక 17 సిల్వర్ ఈటీఎఫ్ ల్లోనూ హెచ్డీఎఫ్సీ సిల్వర్ ఈటీఎఫ్ మొదటి వరుసలో నిలిచింది. హెచ్డీఎఫ్సీ సిల్వర్ ఈటీఎఫ్ లో పెట్టుబడులపై అత్యధికంగా 22.02 శాతం, నిప్పన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ 20.33 శాతం, యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్ 18.46 శాతం రిటర్న్స్ అందించాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదలకు అనుగుణంగా ఈటీఎఫ్ విలువ కూడా పెరుగుతుంది.2023లో గోల్డ్ ఈటీఎఫ్ లు సరాసరి 13 శాతం రిటర్న్స్ అందిస్తే, సిల్వర్ ఈటీఎఫ్ ల నుంచి ఇన్వెస్టర్లు 4.17 శాతం లాభాలు సంపాదించారు.

Views: 0

About The Author

Tags:

Latest News

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..... ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: యస్, ఆర్, యస్, పి,క్యాంప్  గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..విద్యార్థులకు పండ్ల పంపిణీ..
కోరుట్ల కళ్యాణ మండపం అభివృద్ధి పనుల అనుమతి కోసం టీటీడీకి నివేదించిన జువ్వాడి కృష్ణారావు.,.
మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయ్ పూలే జయంతి జయంతి వేడుకలు అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 3:
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ మండల కార్యవర్గ నియామకం అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 03:
మహిళా సాధికారతకై  కృషి చేసిన మహనీయులు..  రాష్ట్ర  కార్యదర్శి   బీ సి యువజన  సంఘం..   శికారి గోపికృష్ణ  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: