కిలో రూ.100 లకు చేరిన టమాటా..!
అక్షర గెలుపు : కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఎక్కువగా వాడే టమాటా ధర భారీగా పెరిగింది. వరంగల్ లోని లక్ష్మిపురం కూరగాయల మార్కెట్ లో టమాటా ధర భారీగా పెరిగింది. మంగళవారం గరిష్ఠంగా రూ.80లు ధర పలికింది. రిటైల్ మార్కెట్ల లో కిలో టమాటా రూ.100 చేరింది. గత నెల రోజుల క్రితం కిలో టమాటా ధర రూ.40 నుంచి రూ.50 మాత్రమే పలికేది కానీ ఇప్పుడు భారీగా పెరిగింది. ఉత్పత్తి తగ్గి డమాండ్ పెరగడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకుందని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.రెండు రోజుల క్రితం ఏపీలోని మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో సోమవారం కిలో టమాటా ధర అత్యధికంగా రూ.80 పలికిన సంగతి తెలిసిందే. టమాటా ధరలు మాత్రమే కాదు మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. పచ్చి మిర్చి కిలో రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. కొత్తిమీర కిలో రూ.250గా ఉంది. పాలకూర కిలో రూ.120 పలుకుతోంది. క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ ధరలు కూడా భారీగానే పెరిగాయి.