ప్రపంచ ప్రథమ రెసిడెవ్షియల్‌ విశ్వవిద్యాలయం నాటి ఘన నలంద యూనివర్సిటీ !

ప్రపంచ ప్రథమ రెసిడెవ్షియల్‌ విశ్వవిద్యాలయం నాటి ఘన నలంద యూనివర్సిటీ !

        సంస్కృత భాషలో ‘నలంద’ అనగా ‘జ్ఞానాన్ని పంచేది’ అని అర్థం. ఇప్పటి బీహార్‌ రాష్ట్రంలో పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ల (దాదాపు 100 కిమీ) దూరంలో రాజ్‌గిరి సమీపాన నెలకొన్న బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా పేరొందిన ప్రాచీన అతి ఘనమైన కట్టడంతో వర్థిల్లిన మహావిద్యాలయమే నాటి ‘నలంద విశ్వవిద్యాలయం’. 5న శతాబ్దంలో ప్రారంభమైన నలంద విశ్వవిద్యాలయం 800 ఏండ్ల పాటు విజ్ఞాన వితరణ కేంద్రంగా బాసిల్లి 13వ శతాబ్దంలో నాటి దుర్మార్గ పాలకుల చేత పూర్తిగా విధ్వంసం చేయబడడం బహువిచారకరం. 8 దశాబ్దాలుగా మేధావులను, శాస్త్రవేత్తలను తయారు చేసిన ఉన్నత విద్య కర్మాగారంగా ఖ్యాతి గాంచింది. 

నాటి ఘన నలంద విశ్వవిద్యాలయం:
         నలంద విశ్వవిద్యాలయ పురావస్తు అవశేషాలు ఇప్పుడు ‘యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం’గా గుర్తింపు పొందాయి. క్రీ శ 450 ప్రాంతంలో గుప్తరాజులకు చెందిన కుమార గుప్త నిర్మించిన తొలి ఆవాస మహావిద్యాలయంగా వెలసింది నలంద విశ్వవిద్యాలయం. ఈ విద్యా కేంద్రం 10,000 మంది విద్యార్థులకు జ్ఞాన బోధ చేయగా, 2,000 వరకు అత్యంత ప్రతిభగల అధ్యాపకులు బోధనలు చేశారు. నలందలో ప్రదేశానికి నాటి ప్రొఫెసర్లు ఇంటర్వ్యూలు నిర్వహించే పద్దతినా పాటించుట జరిగేదనే విషయం ఆ విశ్వవిద్యాలయ నాణ్యత, ప్రమాణాలను రుజువు చేస్తున్నాయి. నలంద విశ్వవిద్యాలయ సువిశాల ప్రాంగణంలో ఎన్నో దేవాలయాలు, ధ్యాన మందిరాలు, కొలనులు, ఉద్యాన వనాలు, ప్రత్యేక ఆవరణలు, తరగతి గదులు ఉండేవి. నలంద విశ్వవిద్యాలయంలో ప్రత్యేకమైన 9 అంతస్తుల గ్రంధాలయం, అందులో 9 లక్షలకు పైగా తాళపత్రాలు, రాతప్రతులు కొలువుతీరేవి. ప్రాచీన ఆక్స్‌ఫర్డ్‌, బోలోగ్నా విశ్వవిద్యాలయాల కన్న 500 ఏండ్ల ముందే నలంద విశ్వవిద్యాలయం సేవలు అందించింది. 1812లో నలంద విశ్వవిద్యాలయ ఆనవాళ్లను స్కాట్‌లాండ్‌ ఆర్కియాలజిస్ట్‌ చూపే వరకు నలంద చిరునామా కనబడలేదని దుస్థితిని దాటి వచ్చాం. 

ప్రపంచంలోనే ప్రథమ రెసిడెన్షియల్‌ నలంద విశ్వవిద్యాలయం:
        “అంతర్జాతీయ నలంద విశ్వవిద్యాలయ” ప్రాంగణంలో భారతీయులే కాకుండా కొరియా, జపాన్‌, చైనా, టిబెట్‌, ఇండోనేషియా, పర్షియా, శ్రీలంక, టర్కీ వంటి దేశాలకు చెందిన యువతరం ప్రవేశాలు పొందడమే కాకుండా బోధనలు కూడా చేసే వారు. క్రీ శ 1193లో నలంద అంతర్జాతీయ విశ్వవిద్యాలయ సముదాయాన్ని మిలటరీ జనరల్‌ భక్తియార్‌ ఖిల్జీ నాయకత్వపు దోపిడీ తురుష్క దళాలు దండెత్తి పూర్తిగా ధ్వంసం చేసి బౌద్ధ మత క్షీణతకు ఆజ్యం పోశారు. ఖిల్జీ దండయాత్రతో దగ్ధమైన గ్రంధాలయంలోని అనేక గ్రంథాలు అగ్నికి ఆహుతి కావడం జరిగింది. జీర్ణావస్థలో ఉన్న నాటి నలంద కట్టడాలు నేటికీ మిగిలే ఉన్నాయి. నలంద ప్రాంతంతో బుద్ధుడు, మహావీరుడు, నాగార్జున, ఆర్యభట్టా, ధర్మకీర్తి, సిలభద్ర లాంటి గొప్ప మేధావుల ప్రకంపనలతో సృష్టించింది. జీరలను ప్రతిపాదించిన గణిత, ఖగోళ మేధావి భారత గణితశాస్త్ర పితామహుడు ఆర్యభట్ట 6వ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయాన్ని నేతృత్వం వహించినట్లు తెలుస్తున్నది. ప్రపంచ తొలి రెసిడెన్షియల్‌ విశ్వవిద్యాలయం 8 శతాబ్దాలకు పైగా నిరాటంకంగా ఉన్నత విద్యను వితరణ చేయడం విశేషం. ఆయుర్వేద వైద్య, తర్క, గణిత, వాతావరణ, వాస్తుశిల్ప, అభ్యాస, బౌద్ధ, ఖగోళ శాస్త్రాలు ఇక్కడ బోధించబడేవని తెలుస్తున్నది. 

 నలంద విశ్వవిద్యాలయ పునరుజ్జీవనం:
         నలంద విశ్వవిద్యాలయం ధ్వంసమైన తర్వాత 600 ఏండ్లకు అదే ప్రదేశంలో నూతన నలంద యూనివర్సిటీ ఏర్పాటు కావడం ఆహ్వానించదగిన పరిణామమే. 2006లో నాటి రాష్ట్రపతి ఏపి జె అబ్దుల్‌ కలాం చొరవతో 485 ఎకరాల ప్రాంగణంలో పురాతన నలంద వాస్తును ప్రతిబింబించే నిర్మాణాలతో నూతన నలంద కేంద్ర విశ్వవిద్యాలయం తిరిగి నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి నేడు రూ: 1,700 కోట్లకు పైగా వ్యయంతో పూర్తి స్థాయి నవ్య నలంద విశ్వవిద్యాలయంగా సేవలు అందిస్తున్నది. నలంద యూనివర్సిటీ నూతన ప్రాంగణాన్ని 3ల సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ ప్రారంభించడం, 17 దేశాల ప్రతినిధులు హాజరు కావడం కూడా చూసి ఆనందించాం. పిజీ, పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లను అందిస్తున్న నలంద యూనివర్సిటీలో ప్రస్తుతం ఐదు పిజీ స్కూల్స్ (చరిత్ర, పర్యావరణం, తత్వశాస్త్రం, లిటరేచర్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాలు)‌ ప్రారంభం అయ్యాయి. దశల వారీగా ఇతర విభాగాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. మొత్తం 1900 సీటింగ్‌ కెపాసిటీతో 40 క్లాస్‌ రూమ్‌లతో రెండు అకడమిక్‌ బ్లాక్‌లో, 300 కెపాసిటీ కలిగిన రెండు ఆడిటోరియంలు, 550 మంది ఉండేలా రెండు హాస్టల్స్‌, ఇంటర్నెట్‌ సెంటర్‌, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, ఫాకల్టీ క్లబ్‌ వంటి సౌకర్యాలతో కొత్త క్యాంపస్‌ తయారు అయ్యింది. 
       డిజిటల్‌ యుగంలో ఏర్పాటు చేయబడిన నలంద యూనివర్సిటీ పనితనం, నాణ్యతలను ప్రాచీన నలంద విశ్వవిద్యాలయ స్థాయికి తగ్గకుండా చూస్తూ ప్రపంచం మెచ్చిన అతి పెద్ద ఉన్నత విద్యా కేంద్రంగా రానున్న కాలంలో భాసిల్లాలని, రాబోయే యువతరానికి ఇదో విద్యా జ్యోతిగా వెలుగుతూ యువత అజ్ఞాన చీకట్లను తరమాలని కోరుకుంటూ, ఉన్నత విద్యా ప్రాంగణం స్థాపనకు అవసర నిధులు కేటాయించడంలో చొరవ చూపిన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిద్దాం. 

8f401886-0154-4f4f-a95a-0b68028614a7

         డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
                9949700037

Views: 144

About The Author

CHIFF EDITOR  Picture

D.VENKATESH  PHONE NUMBER : 9490817191

Tags:

Related Posts

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక