శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజున స్పర్శ దర్శనం బంద్..!
శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో జనవరి ఒకటిన మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం రద్దు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. సెలవు, న్యూ ఇయర్ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భక్తులకు జనవరి ఒకటిన కేవలం అలంకార దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మల్లికార్జున స్వామివారి ఆర్జిత గర్భాలయ అభిషేకాలు, ఆర్జిత సామూహిక అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవలను సైతం నిలిపివేసినట్లు చెప్పారు.
సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు భక్తులందరికీ త్వరితగతిన స్వామివార్ల దర్శనాలు కల్పించేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. క్యూకాంప్లెక్సులో భక్తులకు సమయానుసారంగా మంచినీరు, అల్పాహారం అందజేయనున్నట్లు వివరించారు. ఉదయం 10.30 గంటల నుంచే అన్నప్రసాద భవనంలో ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి భక్తులకు లడ్డు ప్రసాద విక్రయకేంద్రాల్లో లడ్డు ప్రసాదాలు అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు.
About The Author


Related Posts

