వేగంగా వెళ్తున్న కారు బానెట్‌పై బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

 వేగంగా వెళ్తున్న కారు బానెట్‌పై బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?

జైపూర్‌: వేగంగా వెళ్తున్న కారు బానెట్‌పై బాలుడు కూర్చొన్నాడు. ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం వీడియో తీశారు. ఆ చిన్నారికి ప్రమాదం కలిగేలా వ్యవహరించిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. స్పందించిన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని ఝలావర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాతీయ రహదారి 52లోని గుర్జార్ కా ధాబా ప్రాంతంలో ఒక కారు వేగంగా వెళ్తున్నది. కారు ముందున్న బానెట్‌పై పదేళ్ల వయస్సున్న బాలుడు కూర్చొన్నాడు. ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం వీడియో తీశారు.

కాగా, మరో కారులో ప్రయాణించిన వ్యక్తి దీనిని రికార్డ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడికి ప్రమాదం కలిగించేలా ఉన్న రీల్‌ స్టంట్‌ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఝలావర్ పోలీసులు స్పందించారు. సుమోటోగా కేసు నమోదు చేశారు. కారు నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా యజమానిని గుర్తించి తగిన చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు.

Views: 0

About The Author

Tags:

Related Posts

Latest News

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..... ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: యస్, ఆర్, యస్, పి,క్యాంప్  గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..విద్యార్థులకు పండ్ల పంపిణీ..
కోరుట్ల కళ్యాణ మండపం అభివృద్ధి పనుల అనుమతి కోసం టీటీడీకి నివేదించిన జువ్వాడి కృష్ణారావు.,.
మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయ్ పూలే జయంతి జయంతి వేడుకలు అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 3:
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ మండల కార్యవర్గ నియామకం అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 03:
మహిళా సాధికారతకై  కృషి చేసిన మహనీయులు..  రాష్ట్ర  కార్యదర్శి   బీ సి యువజన  సంఘం..   శికారి గోపికృష్ణ  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: