ప్రధాని మోదీతో శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే భేటీ..!

ప్రధాని మోదీతో శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే భేటీ..!

PM Modi | శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మూడురోజుల పర్యటన కోసం ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం విస్తృత చర్చలు జరిపారు. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దిసనాయకే తొలి విదేశ పర్యటన ఇదే. చర్చలకు ముందు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ, అనుర దిసానాయక్ మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ వివరించారు.

ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, భద్రతా సహకారంపై జరిగినట్లు తెలిపారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ సైతం సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. భారత్‌లో తొలిసారిగా పర్యటిస్తున్న దిసనాయకేను కలవడం ఆనందంగా ఉందన్నారు. నైబర్‌హుడ్‌ ఫస్ట్‌ విధానం, సాగర్‌ ఔట్‌లుక్‌కి శ్రీలంక కీలకమైందని.. ప్రధాని మోదీ, దిసనాయక మధ్య చర్చలు విశ్వాసం, సహకారాన్ని పొందిస్తాయని ఆశిస్తున్నానన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ జరిపిన చర్చల్లో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు దిసనాయకే పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోగా.. కేంద్ర మంత్రి ఎల్‌ మురుగన్‌తో పాటు అధికారులు స్వాగతం పలికారని సోషల్‌ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

Views: 0

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక