#Draft: Add Your Title
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్25:
క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు శుభాకాంక్షలు తెలిపారు కోరుట్ల పట్టణంలోని చర్చిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు క్రీస్తు జన్మదినం సందర్భంగా నిర్వహించే కార్యక్రమమే క్రిస్మస్ అని ఏసుక్రీస్తు సర్వ మానవాళి శాంతి సౌభ్రాతృత్వాలను కోరుకున్నారని నేడు ప్రజలందరూ కూడా శాంతి ప్రేమ సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు యేసుక్రీస్తు బోధనలు నేటి మానవ జీవితానికి శాంతి మార్గం చూపుతాయని జువ్వాడి కృష్ణారావు అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణారావుతోపాటు చర్చ్ ఫాదర్ కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ కాంగ్రెస్ నాయకులు వార్డ్ కౌన్సిలర్ ఎంబెరి నాగభూషణం పుప్పాల ప్రభాకర్ ఎలిశెట్టి భూమారెడ్డి మ్యాకల నర్సయ్య ఎడ్ల రమేష్ చిలువేరి విజయ్ క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.