ప్రీమియర్‌ షోలు, టికెట్‌ ధరల పెంపు.. సీఎం రేవంత్‌ను కలిసే యోచనలో టాలీవుడ్‌ ప్రముఖులు

ప్రీమియర్‌ షోలు, టికెట్‌ ధరల పెంపు.. సీఎం రేవంత్‌ను కలిసే యోచనలో టాలీవుడ్‌ ప్రముఖులు

హైదరాబాద్‌: పుష్పా-2 ప్రీమియర్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ఇకపై ప్రీమియర్‌ షోలకు అనుమతి ఇచ్చేదిలేదని కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రకటించింది. అదేవిధంగా సినిమా రేట్ల పెంపుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. చారిత్రక, తెలంగాణ ఉద్యమం వంటి సినిమాలకు మాత్రమే టికెట్ల రేట్లు పెంపు అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డిని తెలుగు సినీ ప్రముఖులు  కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

రామ్‌చరణ్‌ నటించిన గేమ్‌ చేంజర్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎఫ్‌డీసీ చైర్మన్‌, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలవడంపై నిర్ణయం తీసుకుంటామని నిర్మాత నాగవంశీ చెప్పారు. టికెట్‌ ధరల పెంపు, ప్రీమియర్‌ షోలపై చర్చిస్తామని వెల్లడించారు. సంధ్య థియేటర్‌ వద్ద అనుకోని ఘటన జరిగిందన్నారు. ఏ హీరో, నిర్మాత అలా జరగాలని కోరుకోరని చెప్పారు. సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోతుందనేది అవాస్తవమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు అక్కడి ప్రభుత్వం సహకరిస్తున్నదని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్‌లు జరుగుతున్నాయని చెప్పారు.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని