నాగచైతన్యను శోభిత తొలిసారి కలిసింది..పెళ్లి ప్రపోజల్ పెట్టింది అప్పుడేనట..!
టాలీవుడ్ సెలబ్రిటీలు అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారని తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ఇద్దరు తాజాగా తమ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. 2018లో నాగార్జున నివాసంలో నాగచైతన్య-శోభిత తొలిసారి కలిశారట. స్పై సినిమా గూడఛారిలో తన యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయి చైతూ నాన్న నాగార్జున ఇంటికి ఆహ్వానించారని చెప్పింది.
ఇక సోషల్ మీడియాలో ఒకరినొకరు యాడ్ చేసుకున్న వీరిద్దరూ 2022లో మొదటి సారి చిట్ చాట్ చేశారు. ఆహారం పట్ల తమకున్న ఇష్టం, ప్రేమ గురించి నెట్టింట షేర్ చేసుకున్నారు. ఇద్దరూ ఎప్పుడు కలిసినా ఆహారం గురించి చర్చించుకునేవాళ్లమంది శోభిత. చైతూ తనను తెలుగులో మాట్లాడమని ఎప్పుడూ అడిగేవాడని.. తెలుగులో మాట్లాడటం వల్ల తమ రిలేషన్‌షిప్ మరింత బలపడిందని చెప్పింది.
తరచూ ఫ్లైట్‌లో ముంబైకి..
ఇక రెండు వారాల తర్వాత నాగ చైతన్య తనతో కలిసి లంచ్ చేయడానికి ఫ్లైట్‌లో ముంబైకి వచ్చాడని చెప్పింది శోభిత. అది చాలా మనోహరమైన విషయం. నేను నెట్టింట టెక్స్టింగ్ చేసేందుకు.. సోషల్ మీడియాలో కమ్యూనికేట్ చేయడానికి అభిమానిని కాదని.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్‌లో తాము మళ్లీ కలుసుకున్నామని.. తాను రెడ్ డ్రెస్‌లో ఉండగా.. చైతూ బ్లూ సూట్‌లో ఉన్నాడంటూ చెప్పుకొచ్చింది.
తాము తొలిసారి ముంబైలోని ఓ కేఫ్‌లో కలుసుకున్నామన్న శోభిత.. అప్పుడు తాను ముంబైలో..నాగచైతన్య హైదరాబాద్‌లో ఉండేవాళ్లమంది. తన కోసం చైతూ తరచూ హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చేవాడని తెలిపింది. ఇప్పుడీ కామెంట్స నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య ఫ్యామిలీ న్యూఇయర్ వేడుకలకు నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాతి ఏడాదే చైతన్య తన కుటుంబాన్ని కలిశాడని చెప్పింది శోభిత. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చినట్టు చెప్పింది.