పోస్టల్ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ మెసేజ్‌ వస్తే డిలీట్ చేసేయండి..!!

పోస్టల్ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ మెసేజ్‌ వస్తే డిలీట్ చేసేయండి..!!

అక్షరగెలుపు న్యూస్ డెస్క్  :దేశంలోని కోట్లాది మంది గ్రామీణ, పట్టణ ప్రజలు ఎన్ని బ్యాంకింగ్ సంస్థలు వచ్చినా ఇప్పటికీ వారు నమ్మేది పోస్టల్ స్వీసులనే. వారు తమ గ్రామాల్లోనే వీటిలో డబ్బును పొదుపుచేసుకోవటం నుంచి ఇన్సూరెన్స్ వంటి సేవల వరకు వీటి నుంచి పొందుతున్నారు. అయితే ఈ సారి స్కామర్లు పోస్టల్ వినియోగదారులను టార్గెట్ చేయటంతో చాలా మంది నష్టపోతున్నారు. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.మోసగాళ్లు ఇప్పటికే దేశంలో అనేక కొత్త పద్ధతులను వినియోగించి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థల పేర్లను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా వీరు ఇండియా పోస్ట్ పేరును పెద్ద స్థాయిలో మోసాలకు వినియోగించటం వెలుగులోకి వచ్చింది. ఈ కొత్తరకం మోసంలో ముందుగా ఇండియా పోస్ట్ పేరుతో మోసగాళ్లు ప్రజలకు మెసేజ్ పంపిస్తున్నారు. వారు ఆ మెసేజ్‌లో ఒక వెబ్ లింక్ పంపుతారు. మీకు పార్శిల్ డెలివరీ కోసం 48 గంటల్లో చిరునామాను ఇవ్వాలని మోసగాళ్లు సదరు మెసేజ్ ద్వారా అడుగుతున్నారు.ఇండియా పోస్ట్ పేరుతో ప్రజలకు వస్తున్న ఈ ఫేక్ మెసేజ్ పై ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజలను హెచ్చరిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఒక పోస్ట్ షేర్ చేసింది. నేరగాళ్లు పంపిస్తున్న ఫేక్ మెసేజ్‌లోని లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందువల్ల ఇలాంటి మెసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని వారు కోరుతున్నారు.


Views: 35

About The Author

CHIFF EDITOR  Picture

D.VENKATESH  PHONE NUMBER : 9490817191

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక