మూసీలో కూల‌గొట్టిన ఇళ్ల‌కు ఈఎంఐలు ఉంటే ప్ర‌భుత్వం చెల్లిస్తుందా..? : ఎమ్మెల్సీ క‌విత‌

మూసీలో కూల‌గొట్టిన ఇళ్ల‌కు ఈఎంఐలు ఉంటే ప్ర‌భుత్వం చెల్లిస్తుందా..? : ఎమ్మెల్సీ క‌విత‌

| హైద‌రాబాద్ : మూసీ అభివృద్ధి పేరిట ఆ ప‌రివాహ‌క ప్రాంతంలో కూల‌గొట్టిన ఇళ్ల‌కు ఈఎంఐలు ఉంటే ప్ర‌భుత్వం చెల్లిస్తుందా..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత సూటిగా ప్ర‌శ్నించారు. మూసీ అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా డీపీఆర్ చేస్తున్నామ‌ని మంత్రి శ్రీధర్ బాబు శాస‌న‌మండ‌లిలో ప్ర‌స్తావించ‌గా.. ఎమ్మెల్సీ క‌విత ప‌లు అంశాల‌పై ప్ర‌శ్న‌లు సంధించారు.

మూసీ నది విషయంలో డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ రూ. 4100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వ ఆశ్రయించినట్లు మాకు నిర్ధిష్టమైన సమాచారం ఉంది. ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా..? డీపీఆర్ తయారు కాలేదని ప్రభుత్వం ఈ రోజు సభకు చెప్పింది. ఏ తేదీన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయం కోరుతూ ప్రతిపాదనలు పంపించింది. మూసీ కోసం రూ. 14,100 కోట్ల వ్యయం అవుతుందని, నిధులతో పాటు అనుమతులు ఇప్పించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏ ప్రాతిపదికన అడిగారు. ఒక వేళ కేంద్రాన్ని సాయం కోరడం, ప్రపంచ బ్యాంకు సాయం కోరడం వాస్తవమైతే సభను, ప్రజలను ఎందుకు తప్పదోవపట్టిస్తున్నారు..? సభను తప్పదోవ పట్టిస్తే అవసరమైతే… ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడుతాం అని క‌విత హెచ్చ‌రించారు.

మూసీ నదిగర్భంలో నివసించే 309 కుటుంబాలు వాళ్లంతట వాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది. కానీ హృదయవిదారకమైన వీడియోలను చూస్తే ప్రభుత్వం చెబుతున్నది అవసస్తవమని స్పష్టమవుతోంది. ఆ 309 కుటుంబాలు సమ్మతిస్తూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 181 కుటుంబాలు తామంతట తామే కూల్చేసుకొని వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది… ఇది వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంది. మూసీ నిర్వాసితుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలి అని కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఎమ్మెల్సీ క‌విత సూచించారు.

Views: 0

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక