భారతదేశ స్థితి గతిని మార్చిన ఘనత మాజీ ప్రధాని పీవీ దే... సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుజువ్వాడి కృష్ణారావు...
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్23:
భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి తెలుగు ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు అని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నుండిఅప్పటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం దేశంలోని బంగారాన్ని సైతం విదేశీ బ్యాంకుల్లో కుదవ పెట్టగా ఆ పరిస్థితుల నుండిదేశాన్ని గట్టెక్కించిన గొప్ప మహానుభావుడు పీవీ నరసింహారావు అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు ఈరోజు మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు దేశ ఆర్థిక రంగ సంస్కరణలకు ఆధ్యుడు అయిన పీవీ నరసింహారావు మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం అని అన్నారు ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరమాండ్ల సత్యనారాయణ పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మచ్చ కవిత మ్యాకల నర్సయ్య మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ఎంబేరి నాగభూషణం పుప్పాల ప్రభాకర్ ఏం బేరి సత్యనారాయణ వాసం అజయ్ తెడ్డు విజయ్ చిట్యాల అశోక్ యూటుబ్ రాజు తదితరులు పాల్గొన్నారు.