ఢల్లీ మద్యం కేసులో ఊరట కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
అక్షరగెలుపు న్యూఢల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ భారీ ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 48 గంటల పాటు బెయిల్ ఆర్డరును నిలిపివేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో మార్చి 21న ఈడీ కేజీవ్రాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ పిటిషన్‌కు సంబంధించి గురువారం ఉదయం (జూన్ 20న) తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జి నియాయ్ బిందు.. అదే సాయంత్రం బెయిల్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, బెయిల్ బాండుపై సంతకం చేసేందుకు వీలుగా 48 గంటలపాటు స్టే విధించాలని న్యాయస్థానాన్ని ఈడీ కోరింది. తద్వారా ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేసేందుకు వీలు కలుగుతుందని విన్నవించింది. అయినప్పటికీ ఈడీ వాదనను తోసిపుచ్చిన కోర్టు.. అందుకు నిరాకరించింది.
కేజీవ్రాల్‌కు బెయిల్ మంజూరు చేయడంపై ఆప్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆప్ నేత, దిల్లీ మంత్రి అతిశీ సత్యమే గెలిచిందన్నారు. సత్యానికి కొన్నిసార్లు ఇబ్బందులు రావొచ్చేమో గానీ.. ఓటమి మాత్రం ఉండదన్నారు.