కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కి
అధ్యక్షులు బద్రు నాయక్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 23.
సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బద్రు నాయక్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఎస్టీ కార్పొరేషన్ సబ్సిడీ నిధులు విడుదల చేయాలని 2020 లో అప్పటి ప్రభుత్వం టిఆర్ఎస్ ఆన్లైన్లో ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక చేసింది చాలామందికి చెక్ జనరేట్ అయి ఉన్నాయి 2024 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న కూడా ఇప్పటికీ సబ్సిడీ నిధులు జమ కాలేదు కాబట్టి అట్టి సబ్సిడీ నిధులు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని రాష్ట్ర విద్యార్థి నాయకుడు
ఏ ఎన్ ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే జిల్లాలోని మిషన్ భగీరథ లో పాల్వంచ మండలంలోని స్థానికులను గుర్తించి ఎంపిక చేయాలన్నారు లేబర్ యాక్ట్ ప్రకారం కార్మికులకు సరైన టైంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బద్రు నాయక్ రాష్ట్ర నాయకులు నగేష్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ యువసేన జిల్లా అధ్యక్షులు ప్రతాప్ నాయక్ పాల్వంచ మండల యువసేన అధ్యక్షులు విద్యాసాగర్ లక్ష్మీదేవి మండల యువసేన అధ్యక్షులు గణేష్ నాయక్ జిల్లా గౌరవ అధ్యక్షులు బిచా నాయక్ రాజా నాయక్ వీరేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు